గుండెపోటును ముందుగానే గుర్తించే యాప్!
గుండెపోటు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. అయితే అమెరికాలోని ఇంటర్ మౌంటెయిన్ మెడికల్ సెంటర్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు ప్రాణాంతక గుండెపోటును ముందుగానే గుర్తించే ఒక సరికొత్త స్మార్ట్ఫోన్ యాప్ను రూపొందించారు. ఆలివ్కోర్గా పిలిచే ఈ యాప్, ఈసీజీ అంతటి కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఈ యాప్ గుండె పనితీరును పర్యవేక్షించి, ధమనుల్లో ఏదైనా అడ్డపడితే దాన్ని గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనల్లో భాగంగా గుండె నొప్పి వచ్చిన 204 మందికి ఈసీజీ, ఆలివ్కోర్ యాప్ సాయంతో పరీక్షలు నిర్వహించారు.













