ATA: ఆటా వేడుకలకు త్రిపుర గవర్నర్కు ఆహ్వానం
హైదరాబాద్: త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, రేపు జరగనున్న ఆటా వేడుకలు 2025 గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆటా చేపడుతున్న సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను గవర్నర్కు వివరించారు. ఆటా కార్యక్రమాలు సమాజ సేవతో పాటు తెలుగు సంస్కృతి పరిరక్షణకు దోహదపడుతున్నాయని ప్రతినిధులు తెలిపారు. గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఆటా సేవలను ప్రశంసిస్తూ, గ్రాండ్ ఫినాలేకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ను కలిసిన వారిలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, విజయ్ గోలి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.






