Ireland: ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు

ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) అల్లే శ్రీనివాస్ మరియు బలరాం కొక్కుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను గణంగా నిర్వహించారు . డబ్లిన్ నగరంలో 50 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలని వాలంటీర్లు మరియు దాతల సహాయంతో ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు 40 మంది వాలంటీర్లు మరియు 50 మంది దాతలు ముందుకొచ్చి బతుకమ్మ వేడుకలు జరుపుటకు ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 750 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ, కోలాటం మరియు దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ మరియు దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి . మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు . చిన్న పిల్లలకు మేజిక్ షో ఏర్పాటు చేశారు. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ఆడపడుచులకు బహుమతి ప్రధానం చేసారు. వచ్చిన అతిధులకు ప్రసాదం, సాయంత్రం తేనీరు, స్నాక్స్ మరియు రాత్రి రుచికరమైన వంటలు వడ్డించారు.