న్యూజీలాండ్ లో తెలంగాణ రాష్ట్ర 8 వ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజీలాండ్ లో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తెలంగాణ తెరాస పార్టీ న్యూజీలాండ్ శాఖ ఆధ్వర్యంలో 8 వ రాష్ట్ర అవతరణ దినోత్సవం వెస్లీ కమ్యూనిటీ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమం న్యూ జీలాండ్ తెరాస శాఖ అధ్యక్షులు శ్రీ జగన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముందుగా అమరులకు నివాళులు అర్పించి, రాష్ట్ర గీతం ఆలపించారు. జగన్ గారు మాట్లాడుతూ ఉద్యమం నుంచి నేటి వరకు కెసిఆర్ గారి పాత్ర, పార్టీ పాత్ర గురించి వివరించారు.
ఈ కార్యక్రమం విజయవంతం లో ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ ప్రకాష్ గారు, హోనోరారి చైర్ పర్సన్ శ్రీ నర్సింగ రావు ఇనగంటి, ఉపాధ్యక్షుడు శ్రీ కిరణ్ కుమార్ పోకల ప్రముఖ పాత్ర పోషించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా తెరాస శాఖ, వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ విజయభాస్కర్ రెడ్డి కొసన, ట్యాంజు వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ రావు కాసుగంటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మోహన్ రెడ్డి బీరపు, పానుగంటి శ్రీనివాస్, గిరిధర్ మోర్ల, వ్యాపారవేత్తలు, కృష్ణ కుమార్ పూసర్ల శ్రీని తదితరులు పాల్గొన్నారు.













