లండన్లో ఘనంగా బోనాల జాతర
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు చేశారు. పోతురాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు వెయ్యికి పైగా ప్రవాస తెలుగు కుటుంబాలు హాజరైనట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు గొప్పగా ఉందని హౌంస్లా నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు శుష్మణరెడ్డి పాల్గొన్నారు.







