తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో చెస్ టోర్నీకి డేట్ ఫిక్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్‌కు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 24న 12.30 గంటల (ఈఎస్టీ) నుంచి 6.00 గంటల (ఈఎస్టీ) వరకు ఈ టోర్నీ జరగనుంది. పెన్సిల్వేనియాలోని ఎక్టన్లో ఉన్న స్ప్రింగ్‌డేల్ డ్రైవ్‌లో 5 రౌండ్ స్విస్ సిస్టమ్ జీ 25 డీ5 రూపంలో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఇది ఆన్లైన్ టోర్నీ కాకపోవడంతో పోటీలో పాల్గొనాలని అనుకునేవారంతా స్రింగ్డేల్ డ్రైవ్‌కు రావలసి ఉంటుంది. మొత్తం నాలుగు సెక్షన్లలో జరిగే ఈ పోటీలో.. అండర్ 800 రేటెడ్, ఓపెన్ రేటెడ్ విభాగాల్లో అన్ని వయసుల వారూ పాల్గొనవచ్చు. ఇక కె16 విభాగంలో కిండర్‌గార్డెన్ నుంచి 6వ గ్రేడ్ వరకు చదువుతున్న విద్యార్థులు, అలాగే కె12 విభాగంలో కిండర్‌గార్డెన్ నుంచి 12వ గ్రేడ్ విద్యార్థుల వరకు పాల్గొనవచ్చు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే ఉత్సాహవంతులు 20 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చెస్ ప్రేమికులు https://tinyurl.com/TANA-MID-ATLANTIC-2024-Chess లింకులో తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.







