ఇ-సైకిళ్ళ వితరణకు తానా సహాయం
కర్నూలు జిల్లాలో మహిళా పోలీసులలో గస్తీ పెంచడం కోసం ఎలక్ట్రికల్ ఇ-సైకిళ్ళ కొనుగోలుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆర్థిక సహాయం అందించింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో తానా నాయకులు రవి పొట్లూరి, ముప్పా రాజశేఖర్, ఏలూరు రవిచంద్ర జిల్లా ఎస్పి గోపీనాథ్ జెట్టిని కలుసుకుని తానా తరపున 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రవి పొట్లూరి మాట్లాడుతూ, తానా తరపున ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నామని, అందులో భాగంగా కప్పట్రాళ్ళలో స్త్రీ శక్తి భవనంను నిర్మించామని, ఆత్మకూరులో ఓ చెంచు గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నామని చెప్పారు.













