ఇర్వింగ్ లో తానా చెస్ పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో డల్లాస్ లోని ఇర్వింగ్ నగరంలో ఏప్రిల్ 22న చెస్ పోటీలను నిర్వహించారు. దాదాపు 75 మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలను తానా డల్లాస్ నాయకులు క్రీడల కమిటీ చైర్మన్ వెంకట్ బొమ్మ, లోకేష్ నాయుడు మరియు కృష్ణ వల్లపరెడ్డి సమన్వయపరిచారు. స్థానిక వండర్లాండ్ మోంటెస్సోరిలో జరిగిన ఈ పోటీలను తానా టెక్సాస్ ప్రాంత సమన్వయకర్త సుగన్ చాగర్లమూడి, చంద్రా రెడ్డి పోలీస్, కుమార్ నందిగం తదితరులు విజయవంతం చేయడంలో సహకరించారు. రాబర్ట్ జోన్స్ నిర్వహణలో విజేతలకు మెమెంటోస్ మరియు మెడల్స్ అందజేశారు.













