ఆన్లైన్ వేదికగా ‘తానా’ బాలోత్సవం
అమెరికాలోని చిన్నారుల ప్రతిభను వెలికితీసే విధంగా వివిధ నగరాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో తానా బాలోత్సవం-2020 పేరుతో వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. అంతర్జాలం ద్వారా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి తెలిపారు. రెండు విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. కిడ్స్ విభాగంలో 5-10 సంవత్సరాల వారికి, జూనియర్స్ విభాగంలో 11-16 సంవత్సరాల వారికి పోటీలను ఏర్పాటు చేశారు. విజేతలను మొదటిసారిగా పబ్లిక్ పోల్స్ ద్వారా సెలెబ్రిటీ జడ్జీల ద్వారా ఎంపిక చేయనున్నారు.
సింగింగ్, డ్యాన్సింగ్, తెలుగు పద్యాలు, ఆర్ట్, క్లాసికల్ సింగింగ్, క్లాసికల్ డ్యాన్స్, పేట్రియాటిక్ ఫ్యాన్సీ డ్రెస్, పబ్లిక్ స్పీకింగ్, రోబోటిక్స్, చెస్ జూనియర్స్, చెస్ కిడ్స్ విభాగంలో పోటీలను నిర్వహిస్తున్నారు. నవంబర్ 14న గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. అక్టోబర్ 16వ తేదీలోపు పోటీలో పాల్గొనవారు తమ పేర్లను ఇవ్వాలి.
ఈ పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలకోసం సంప్రదించండి.
తానా కల్చరల్ కో ఆర్డినేటర్ సునీల్ పంత్ర (248 469 2349), బాలోత్సవం చైర్ రేఖా ఉప్పలూరి (703 340 0873), ఆన్లైన్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి (201 270 8648), టెక్నికల్ కో ఆర్డినేటర్ సుమంత్ రామ్సెట్టి (917 399 0459). మీడియా కో ఆర్డినేటర్ శ్రీని యలవర్తి 732 983 7841ని సంప్రదించవచ్చు.













