ఘనంగా జరిగిన టిఏజిసి సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్
చికాగో మహా నగర తెలుగు సంస్థ, టిఏజిసి (TAGC) చికాగో పరిసర ప్రాంతాల్లోని తెలుగు వారికీ క్రికెట్ సూపర్ 8 టోర్నమెంట్ ఇక్కడి South Barrington Grounds నిర్వహించింది. ఏటా జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి క్రికెట్ ఆటగాళ్లు ఎంతో ఆతృత తో ఎదురు చూసే ఈ టోర్నమెంట్ ఎంతో ఘనంగా జరిగింది.
ఏటా టిఏజిసి (TAGC) నిర్వహించే ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న జట్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ సారి 14 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. రెండు రోజుల వ్యవధి లో జరిగే ఈ టోర్నమెంట్ లో ఎప్పుడు లేని విధంగా 14 జట్లను తీసుకోవడం జరిగింది. ఒక ఇన్నింగ్స్ లో 8 ఓవర్లు ఉండే ఈ టోర్నమెంట్ సూపర్ 8 టోర్నమెంట్ గా అందరికి సుపరిచితమే. అలాగే జట్టు లో కూడా 8 మంది ఆటగాళ్లకు స్థానం ఉంటుంది. 14 జట్లు రెండు రోజుల వ్యవధి లో 17 మ్యాచ్లు ఆడాయి. ఈ ఏడు టోర్నమెంట్ విజేతగా జగర్నట్స్ నిలిచారు.
శనివారం ఉదయం 8 గంటల సమయం లో మొదటి మ్యాచ్ మొదలు ఐంది. హిట్ అండ్ రన్ మరియు హైదరాబాద్ నవాబ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తి కరంగా సాగి టోర్నమెంట్ కు తెర లేపింది. చాల ఉత్కంఠ భరితంగా సాగిన టోర్నమెంట్ లో సుల్తాన్స్, జగర్నట్స్, స్త్రీకేర్స్, రేజింగ్ టైగెర్స్ సెమిస్ కు చేరాయి . మొదటి సెమిస్ లో టైగెర్స్ స్త్రీకేర్స్ పై విజయం సాధించగా , ఇక రెండవ సెమిస్ లో సుల్తాన్స్ జగర్నట్స్ మ్యాచ్ టై గా ముగిసింది, అయితే ముందుగా సూచించినట్టు సూపర్ ఓవర్ లో జగర్నట్స్ సుల్తాన్స్ పై విజయం సాధించి ఫైనల్ కు చేరింది.
ఫైనల్స్ కూడా చాల ఉత్కంఠ భరితంగా సాగింది. మొదట బాటింగ్ చేసిన టైగెర్స్ నిర్ణీత 8 ఓవర్ల లో 48 పరుగులు చేయగా, జగర్నట్స్ 7 .5 ఓవర్ల లో లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన శేఖర్ కు మాన్ అఫ్ ది సిరీస్ అవార్డు లభించగా, జగర్నట్స్ కెప్టెన్ భగత్ గోలి బెస్ట్ బౌలర్ గా ఎంపికయ్యారు. టైగెర్స్ టీం లో అద్భుతమైన బాటింగ్ ప్రతిభ కనబర్చిన నవీన్ గన్నే బెస్ట్ బాట్స్మెన్ గా నిలిచారు.
అనంతరం టోర్నమెంట్ స్పాన్సర్ వర్ణియన్ సంస్థ అధినేత రాజ్ గిన్నె గారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ అద్భుతంగా నిర్వహించిన టిఏజిసి (TAGC)టీం ని అభినందించారు. ఇలాగె ప్రతి ఏడు టోర్నమెంట్ నిర్వహిస్తారని ఆశించారు. అనంతరం టైగెర్స్ కు రన్నర్ అప్ ట్రోఫీ, జగర్నట్స్ కు ఛాంపియన్స్ ట్రోఫీ అందజేశారు.
టోర్నమెంట్ ముగిస్తూ టిఏజిసి (TAGC) సంస్థ ప్రెసిడెంట్ రామచంద్రా ఏడే మాట్లాడుతూ, టోర్నమెంట్ లో పాల్గొన్న జట్ల సభ్యలందరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గెలుపొందిన జట్ల సభ్యులకు , వ్యక్తిగత గెలుపును పొందిన సభ్యులను అభినందించారు. టోర్నమెంట్ స్పాన్సర్స్ Verinon సంస్థ అధినేత రాజ్ గిన్నె గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే టోర్నమెంట్ ను అద్భుతంగా నిర్వహించినందుకు గాను స్పోర్ట్స్ చైర్ సప్తగిరి సంగేమ్ ను, క్రికెట్ కమిటి మెంబెర్స్ వేణు ఎలిశెట్టి, రమణ కాల్వ, సతీష్ నిడదవోలు, శ్రీనివాస్ కన్రు లను & Board అభినందించారు.













