టిఏజిసి సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ సంబరాలు
చికాగో మహా నగర తెలుగు సంస్థ, టిఏజిసి(TAGC) సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ సంబరాలు ఈ నెల జనవరి 13న శనివారం మధ్యాహ్నం 3:0౦ నిమిషములకు ప్రారంభించబడి, రాత్రి 10:30 గంటల వరకు ఇక్కడి స్థానిక శ్రీ రామాలయంలోని కాలా ప్రాంగణములో ఘనంగా జరుపుకుంది.
ఈ కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనతో పాటు సంస్థ ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాము బిల్లకంటి & మాలతీ బిల్లకంటి గారి జ్యోతి ప్రజ్వలతో ప్రారంబించారు. ఎంతో కాలంగా జరుపుకుంటున్న ఈ సంబరాలు ఈ ఏడూ కూడా చాల ఘనంగా జరిగాయి. లెమన్ట్ లో ఉన్న హిందూ టెంపుల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి 1000 కి పైగా మెంబెర్స్, ఇతర అతిధులు విచ్చేసారు. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే ఎన్నో కార్యక్రమాలు టిఏజిసి(TAGC) నిర్వహించింది.
30 కి పైగా సాంస్కృతిక కార్యక్రమాల తో సంక్రాంతి సంబరాలు చాల ఉత్సాహంగా సాగాయి. 300 పైగా చిన్నారులు, స్థానిక కళాకారులూ పాల్గొన్న పలు కార్యక్రమాలు అతిధులను ఆకట్టుకున్నాయి. చికాగోకు చెందిన సింగెర్స్ ప్రవీణ్జాలిగామ, శైలజ, మాధవి గారి గానం అందరిని అలరించింది. అయితే అన్నిటిలో పండు గాడి కోటు గోల, మహిళలు మహారాణులు అనే స్కిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాలను అందించేందుకు కల్చరల్ కమిటీచైర్ పాండురంగా రెడ్డి లెంకల, కో చైర్ శ్వేతా జనమంచి & ఉమా అవధూత ఎంతో కృషి చేసారు.
లామోంట్ టెంపుల్ లోని హాల్ ప్రాంగణం పండగ వాతావరణ్నన్ని తలపించేలా అలంకరించారు. బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. టిఏజిసి(TAGC) ఈ సందర్బంగా ముగ్గుల పోటీలు నిర్వహించింది. గెలిచిన వారికీ స్పాన్సర్ సత్యనారాయణ రెడ్డి కందిమళ్ల గారు గిఫ్ట్ కార్డ్స్ అందజేశారు.
టిఏజిసి(TAGC) విచ్చేసిన అతిధులకు మంచి విందు భోజనం అందజేసింది. స్థానిక బావార్చి రెస్టారెంట్ వారు అందించిన విందు భోజనము అంత బాగా ఎంజాయ్ చేసారు.టిఏజిసి (TAGC) అతిధుల కొరకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి నేతి అరిసెలు తెప్పించారు. భోజనం అంత బాగా ఎంజాయ్ చేసారని ఫుడ్ కమిటీ చైర్ శ్రీనివాస్ కన్రు అన్నారు. సకాలంలో అందరికి భోజనం అందించిన వాలంటీర్స్‌కు కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రెసిడెంట్ జ్యోతి చింతలపని గారి నాయకత్వం లో బోర్డు మెంబెర్స్ ఎంతో కృషి చేసారు. ఈ సందర్బంగా ప్రెసిడింట్ జ్యోతి గారు టిఏజిసి(TAGC) మనుగడకు మెంబెర్స్, వాలంటీర్స్, మరియుస్పాన్సర్స్ ఆవశ్యకతను గుర్తు చేసారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.













