కలాంకు సలాం అన్న టిఏజిసి (TAGC)
చికాగో మహా నగర తెలుగు సంస్థ , టిఏజిసి (TAGC) బోర్డు మరియు యూత్ కమిటీ యువతను ఉత్తేజ పరిచేందుకు అద్భుతమైన కార్యక్రమం నిర్వహించింది. షాంబర్గ్ పబ్లిక్ లైబ్రరీ లో సౌత్ ఆసియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ (SAHA) సంస్థ తో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రసంగించారు. ఈ ప్రసంగాల ద్వారా యువత ఎంతో ఉత్తేజితులు అయ్యారు. వారికీ ఆసక్తి ఉన్న అంశాల పై మరింత అవగాహనా వచ్చిందని పలువురు యూత్ మెంబెర్స్ అన్నారు.
మొదట భారత దేశ మాజీ అధ్యక్షులు, ప్రముఖ శాస్త్రవేత్త డా. అబ్దుల్ కలామ్ గారితో DRDO లో కలిసి పని చేసిన శాస్త్రవేత్త కే.జయప్రకాశ్ రావు గారు ప్రసంగించారు. డా. కలాం గారి విజన్ 2020 గురించి యువతకు తెలియజేసారు. అయన తన ప్రయత్నం లో సఫలీకృతులయ్యారని, తన విజన్ ను యువత ముందుకు తీసుకెళ్ళకని పిలుపునిచ్చారు. డా. కలాం గారి నిజాయితీ, కస్టపడి పని చేసే తీరు యువతకు స్ఫూర్తి కావాలన్నారు. ఈ సందర్బంగా టిఏజిసి (TAGC) దేశానికీ డా. కలాం గారు అందించిన సేవలను మరొక్కసారి గుర్తుచేసింది.
అనంతరం ఇక్కడి కేర్ చికాగో సంస్థ ప్రతినిధులు, అమెరికా విద్య రంగ నిపుణులు, ఇక్కడి కళాశాలల్లో ఉండే స్కాలర్షిప్స్, మరియు గ్రాంట్స్ గురుంచి విద్యార్థులకు విలువైన సమాచారం అందించారు. ఈ కాలం లో ఎంతో ఖర్చు తో కూడుకున్న విశ్వ విద్యాలయాలలో ఉన్న అవకాశాలను వివరించారు. అనంతరం విద్యార్థులు తల్లి దండ్రులకు తమ ఆస్తులపై, పన్నులపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమాన్ని ముగిస్తూ సౌత్ ఆసియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్(SAHA) ప్రతినిధి హబీబ్ ఉల్ హాక్ అన్సారీ మాట్లాడుతూ, ఆటోమిజం, ఎవల్యూషన్, మోషన్ మరియు ఎనర్జీ యొక్క భవిష్యత్తు పై ప్రసంగించారు.
టిఏజిసి (TAGC) అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలు సత్కరించి మెమెంటోలు అందచేసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ యువతకు ఉపయోగపడే ఈ కార్యక్రమం చేపట్టిన సాయి గొంగాటి ని, వెంకట్ గూనుగంటిని, జ్యోత్స్నా పాల్వాయి మరియు విచ్చేసిన అతిథులను అభినందించారు.













