తైక్వాండో క్రీడాకారులకు సత్కారం
డల్లాస్లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన క్రీడాకారులు విజయం సాధించారు. క్రీడాకారులు కొండా సహదేవ్, అబ్దుల్ ఖలీల్, సింధు తపస్వి బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), తెలంగాణా ఎన్.ఆర్.ఐ. విభాగం సంయుక్తంగా సత్కరించింది. విజేతలైన క్రీడాకారులను సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందని టాంటెక్స్ అధ్యక్షురాలు శీలం కష్ణవేణి అన్నారు. క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన శిక్షకుడు జయంత్ రెడ్డిని జ్ఞాపికతో సత్కరించారు. డా. మోహన్ గోలి, రఘు చిట్టిమల్ల, తెలంగాణ ఎన్.ఆర్.ఐ. విభాగం సభ్యులు, కార్యక్రమం జరగడానికి సహాయం చేసిన రెస్టారెంట్ యజమాని నరేంద్ర బాబులకు టాంటెక్స్ కార్యదర్శి మండిగ శ్రీలక్ష్మి కత్ఞతలు తెలియజేసారు. ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కోడూరు క్రిష్ణారెడ్డి, కోశాధికారి పాలేటి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు శరత్ ఎర్రం,సమీర ఇల్లెందుల, బండారు సతీష్, పాలక మండలి అధిపతి కన్నెగంటి చంద్ర, సభ్యుడు పవన్ నెల్లుట్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













