వైభవంగా టాకో సంక్రాంతి వేడుకలు
ఒహాయోలో జనవరి 26వ తేదీన సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (టాకో) ఆధ్వర్యంలో సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలను వైభవంగా నిర్వహించారు. వెస్టర్విల్లే ఒహాయోలోని వెస్టర్విల్లే నార్త్ హైస్కూల్లో జరిగిన ఈ వేడుకలకు 1200మందికిపైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు 300 మంది వేడుకల్లో వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. క్లాసికల్, మాస్ మూవీ డ్యాన్సెస్, హాస్యనాటిక, దుబ్మాష్ పోటీలు, రిపబ్లిక్ డే డ్యాన్స్, ఫ్యాషన్ షో, సినిమా పాటలు, ఆటలు వంటి కార్యక్రమాలతో వేడుకలు కమనీయంగా సాగాయి.
టాకో 2019 ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ ఫణిభూషణ్ పొట్లూరి వేడుకలకు వచ్చినవారికి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. వేడుకలను విజయవంతం చేసిన వలంటీర్లకు, పాల్గొన్న కళాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. టాకో 2019 కల్చరల్ టీమ్ వీణాకామిసెట్టి ఆధ్వర్యంలో పలు విభిన్నమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కుటుంబం కార్యక్రమాల్లో హైలైట్గా నిలిచింది. బట్టర్ఫ్లై ఈవెంట్వారు వేదిక ప్రాంతాన్ని సుందరంగా సంక్రాంతి పండుగ శోభ ఉట్టిపడేలా అలంకరించారు. శ్యామ్ గద్దె ఆధ్వర్యంలో ఫుడ్ టీమ్ వారు స్థానిక హవేలి బిస్ట్రో రెస్టారెంట్ సహకారంతో వచ్చినవారికి పసందైన వంటకాలను వడ్డించారు. టాకో ఛారిటీ కో ఆర్డినేటర్స్ శ్రీవర్షిణి ముదులూరు, సుభాషిణి సాధనాల ఈవెంట్లో తమ సంఘం తరపున నిర్వహించే ఛారిటీ కార్యక్రమాలను తెలియజేశారు. ప్రెసిడెంట్ ఫణిభూషణ్ పొట్లూరి, వైస్ ప్రెసిడెంట్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీనివాస్ పరుచూరి ఈ?సందర్భంగా 2020 సంవత్సరానికిగాను ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఎన్నికైన జగన్నాథ్ చలసానిని అందరికీ పరిచయం చేశారు. 2018 ఎగ్జిక్యూటివ్ కమిటీ సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు.
2019 ఎగ్జిక్యూటివ్ కమిటీ
ప్రెసిడెంట్ – ఫణిభూషణ్ పొట్లూరి
అడ్మిన్ టీమ్ – జగన్నాథ్ చలసాని (ప్రెసిడెంట్ ఎలక్ట్), శ్రీనివాస్ పరుచూరి (వైస్ ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్), స్వామి కావలి (ట్రెజరర్), హర్ష కామినేని (పబ్లిక్ రిలేషన్స్), హరిక కొమ్మూరి (ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ), సుధీర్ కనగాల (జాయింట్ సెక్రటరీ)
కల్చరల్ టీమ్ -వీణ కామిసెట్టి (వైస్ ప్రెసిడెంట్, కల్చరల్), కల్చరల్ కో ఆర్డినేటర్లుగా సరితా నందిమల్ల, శ్వేత ప్రియాంక అడ్డగంటి, రచన బుక్క, విజయ్ మల్లెల, సిద్థార్థ రేవూరు (కల్చరల్ ఈవెంట్ కో ఆర్డినేటర్), ప్రదీప్ కుమార్(కల్చరల్ ఈవెంట్ కో ఆర్డినేటర్), సంధ్య కనక (కల్చరల్ ఈవెంట్ కో ఆర్డినేటర్)
కమ్యూనికేషన్స్ టీమ్ – విజయ్ కాకర్ల (వైస్ ప్రెసిడెంట్, కమ్యూనికేషన్స్), వేణు అబ్బూరి (వెబ్ కో ఆర్డినేటర్)
ఫుడ్ టీమ్ – శ్యామ్ గద్దె (వైస్ ప్రెసిడెంట్), రాజ్ వంటిపల్లి, ప్రతాప్ కంతేటి
స్పోర్ట్స్ టీమ్ – శివ చావా (వైస్ ప్రెసిడెంట్), ప్రదీప్ గుటక
ఛారిటీ ఈవెంట్ కోఆర్డినేటర్స్ – శ్రీ వర్షిణి ముదులూరు, సుభాషిణి సదనాల
యూత్ కో ఆర్డినేటర్స్ – రిత్విక్ పొట్లూరి, తులసి వలిగడ్ల, సాహిత్ బుద్దాల, అషిక కామిసెట్టి, అన్విత దండు, శ్రావ్య పొట్లూరి
2019 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్
శ్రీలత రేవూరు (చైర్ పర్సన్), కోటేశ్వర బోదిపూడి, ప్రసాద్ కండ్రు, రమేష్ కొల్లి, శ్రీకాంత్ మునగాల













