అమెరికాలో శ్రీవారి సేనకు శ్రీకారం
కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా మాతృరాష్ట్రాల్లో చేస్తున్న శ్రీవారి సేన ఇప్పుడు అమెరికాలో 5 రాష్ట్రాలలో శ్రీవారి సేన ఎన్నారై పేరిట ఏర్పాటైంది. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో నాట్స్ సంస్థ ఫౌండర్ రవి ఆలపాటి, ప్రముఖ వ్యాపారవేత్త శరత్ కామినేని, కొండవీటి జ్యోతిర్మయి, సంస్థ అధ్యక్షుడు కేవీవీ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిర్మయి మాట్లాడుతూ విద్య, వైద్య, వ్యవసాయం, సనాతన సంస్కృతి, గ్రామ ఆటలను మరింతగా ప్రోత్సహించటం కోసం ఈ సంస్థను తెలుగు రాష్ట్రాలలో స్థాపించామని చెప్పారు. అమెరికాలోని తెలుగువారు కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు రావటంతో, వాషింగ్టన్, డిట్రాయిట్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో శ్రీవారి సేనలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.













