అమెరికా రక్షణ బడ్జెట్ 45 లక్షల కోట్లు
వచ్చే ఏడాదికి అమెరికా భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రకటించింది. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం-2018 (ఎన్డీఏఏ) పేరిట రూపొందించిన 700 బిలియన్ డాలర్ల ( సుమారు 45.44 లక్షల కోట్లు) ఈ బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. సైనిక, భద్రత సాయం పొందడానికి ఇందులో పాకిస్థాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు. అదే సమయంలో భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ప్రతిపాదించారు. ఈ బిల్లుకు అమెరికా పార్లమెంట్‌లోని ఉభయ సభలు ప్రతినిధుల సభ, సెనేట్ మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపాయి. ఇటీవలే దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన దక్షిణాసియా వ్యూహానికి ఇందులో చోటు కల్పించారు. తదుపరి దశలో ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అతి త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి.













