రెండవ ప్రకటన – కెనడా, అమెరికాసంయుక్త రాష్ట్రాల వక్తలకి ఆహ్వానం

మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీసదస్సు
సెప్టెంబర్ 25-26, 2021 10 AM- 6:00 PM EST (అంతర్జాలంలో)
మిత్రులారా,
రాబోయే సెప్టెంబర్ 25-26, 2021 (శనివారం, ఆదివారం) తారీకులలో మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొని సాహిత్య ప్రసంగాలలో తమ ప్రజ్ఞాపాటవాలనీ, స్వీయ రచనా పఠన విభాగం లో తమ సృజనాత్మకతనీ సహ సాహితీవేత్తలూ, తెలుగు భాషాభిమానులతో పంచుకోమని కెనడా & అమెరికా సంయుక్త రాష్ట్రాల వక్తలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
మా మొదటి ప్రకటనకు సత్వరంగా స్పందించి, ఎంతో ఆసక్తికరమైన తమ ప్రసంగ వివరాలను మాకు పంపించిన అమెరికా, కెనడా దేశాల సాహితీవేత్తలకి ధన్యవాదాలు. మరొక పది రోజులలోగా (జులై 31, 2021) అందిన స్పందనలలో ఎంపిక అయిన వాటికి మాత్రమే ప్రసంగ అవకాశాలు లభిస్తాయి.
కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి పెద్ద ఎత్తున తమదే అయిన ఒక సాహిత్య వేదిక మీద మొదటి సారిగా టొరాంటో (కెనడా) ప్రధాన కేంద్రంగా ప్రతీ రోజూ ఉదయం 10:00 EST నుంచి సాయంత్రం 6:00 EST దాకా కలుసుకునే ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ వీక్షించే లా అంతర్జాలంలో జరుగుతుంది. ఆ రెండు దేశాలనుంచి ఎంపిక అయిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకి జీవన సాఫల్య పురస్కార ప్రదానం ఒక ప్రత్యేక ఆకర్షణ.
ఉత్తర అమెరికా దేశాల వక్తల ప్రసంగ ప్రతిపాదనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ జులై 31, 2021. ప్రతిపాదనలు, ఇతర వివరాలు పంపించవలసిన చిరునామాలు:
sadassulu@gmail.com
vangurifoundation@gmail.com
ఈ మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రాధాన్యత, ప్రధాన ఆశయాలు మొదలైన పూర్తి వివరాలకి ఇందుతో జతపరిచిన సమగ్ర ప్రకటన చూడండి.
సదస్సు కార్యనిర్వాహక వర్గం
సంచాలకులు: లక్ష్మీ రాయవరపు, (టోరంటో), వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్)
సమన్వయ కర్తలు: త్రివిక్రమ్ సింగరాజు (కెనడా), శాయి రాచకొండ (అమెరికా)
సభ్యులు: కృష్ణా రెడ్డి కుంకాల, సర్దార్ ఖాన్
యువతరం: యామిని పాపుదేశి, భావన పగిడేల
నిర్వాహక సంస్థలు, పత్రికలు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక (కెనడా), టొరంటో తెలుగు టైమ్స్ పత్రిక, ఆటవా తెలుగు సంఘం, తెలుగు వాహిని (సాహిత్య వేదిక, టొరంటో), అంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు కల్చురల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో, కేల్గరీ తెలంగాణా సంఘం..