శంకర ఐ ఫౌండేషన్ వార్షిక మీట్
హైదరాబాద్, ఇండోర్లలో నిర్మించనున్న ఐ ఆస్పత్రులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామని శంకర ఐ ఫౌండేషన్ ఛైర్మన్ మురళి కృష్ణమూర్తి అన్నారు
శంకర ఐ ఫౌండేషన్ వార్షిక మీట్ కాలిఫోర్నియాలోని యెసెమిటె నేషనల్ పార్క్లో జరిగింది. ఈ కార్యక్రమంలో 80 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఉద్దేశించి శంకర ఐ ఫౌండేషన్ ఛైర్మన్ మురళి కృష్ణమూర్తి మాట్లాడారు. ఫౌండేషన్ ద్వారా 2016లో 5.3 మిలియన్ డాలర్లు సేకరించి 2.5లక్షల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించామని.. ఇదంతా వాలంటీర్ల అంకితభావం వల్లే సాధ్యమైందన్నారు. ఇప్పటి వరకు 8 కంటి ఆస్పత్రులు నిర్మించి 15లక్షల మందికిపైగా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి వారికి చూపును అందించామని చెప్పారు. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శంకర ఐ ఫౌండేషన్ వాలంటీర్లు సువీన్ ఉప్పల, సతీష్(సియాటెల్), కౌశిక్(ఆస్టిన్), చంద్రమౌళి(డెట్రాయిట్), ఆలన్ క్రిష్ణన్(డీసీ), రాఘవేంద్ర, వీరశంకర్(హోస్టన్), న్యూజెర్సీ, కాలిఫోర్నియా వాలంటీర్లు తమ ప్రాంతాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు.







