ఎఫ్బీ వాడకం తగ్గిస్తే.. జీవితం ఆరోగ్యప్రదం
నెటిజన్లూ.. మీ జీవితం ఆరోగ్య ప్రదం కావాలంటే ఫేస్బుక్ వాడకం తగ్గించాల్సిందే అని జర్మనీలోని రుర్ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఫేస్బుక్ వాడకంతో 286 మంది నెటిజన్ల జీవనశైలిపై పడుతున్న ప్రభావాలపై అధ్యయనం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిలో 146 మందికి స్వేచ్ఛగా ఫేస్‌బుక్‌ను వినియోగించే వీలు కల్పించగా.. మిగతా 140 మంది రోజూ 20 నిమిషాలకు మించి ఎఫ్బీ చూడకూండా పర్యవేక్షించారు. అధ్యయనం అనంతరం వారందరి ఆరోగ్యాలు, జీవనశైలిలో వచ్చిన మార్పులను విశ్లేషించారు. ఎఫ్బీకి సమయం తగ్గించిన వారు ఆత్మన్యూనతా భావపు అవరోధం నుంచి బయటపడటంతో పాటు శారీరక శ్రమను పెంచినట్లు వెల్లడైంది. ఫేస్‌బుక్‌కు సమయం తగ్గించిన ధూమపానప్రియులు రోజూ తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించినట్లు నిర్ధారణ అయింది.













