అమెరికా ఉపాధ్యక్షుడితో ప్రధాని భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌లు సింగపూర్‌లో సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడ తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా పెన్స్‌ను కలిశారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక రక్షణ సహకారం, ఇండో-పసిఫిక్ సంబంధాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. తీరిక లేని పనుల కారణంగా రాలేకపోతున్నానని ట్రంప్ వెల్లడించిన కొద్దిరోజులకే మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడితో సమావేశం కావడంపై ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించడంపై మోదీ పెన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.













