కోలుకుంటున్న ముగ్గురు ఎన్నారైలు …
కరోనాతో విషమ పరిస్థితుల్లో దవాఖానలో చేరిన ముగ్గురు భారతీయ అమెరికన్లు ఫ్లాస్మా థెరపీ తరువాత కోటుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని హ్యూస్టన్‌లోని సెయింట్ లూక్స్ మెడికల్ సెంటర్ దవాఖాన వైద్యులు తెలిపారు. కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ లేనందున టెక్సాస్‌తో పాటు అమెరికాలోని ఇతర రాష్ట్రాల్లో ప్లాస్మా ట్రాన్స్పుజన్ అనే పాత పద్ధతి ద్వారా చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల రిస్క్ తక్కువ ఉండడమే కాకుండా, గతంలో మెరుగైన ఫలితాలు కనిపించిన నేపథ్యంలో దీన్ని అవలంబిస్తున్నారు.
ప్లాస్మా థెరపీ అంటే ఇప్పటికే వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను సేకరించి బాధితులకు ఎక్కిస్తారు. అందులోని యాంటీబాడీస్ బాధితుడి రక్తంలోకి ప్రవేశించి వైరస్‌ను అడ్డుకుంటాయి. యాంటీబాడీస్ అనేవి రక్తంలో ఉండే ప్రొటీన్లు. ఇవి వైరస్, బ్యాక్టీరియాపై పోరాడుతాయి. సెయింట్ లూక్స్ మెడికల్ సెంటర్లో ఐదుగురికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అకడమిక్ ఇంటిగ్రేషన్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. ముగ్గురు భారతీయ అమెరికన్లు రోహన్ భవదేవకర్, లవంగ వేలుస్వామి, సుష్మా సింగ్ చికిత్స అనంతరం కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు.













