వెలుగునిచ్చే మొక్క
ఆహారాన్నే కాదు, వెలుగును కూడా అందించే మొక్కలను అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ శాస్త్రవేత్తలు సృష్టించారు. మొక్కల ఆకుల్లో ప్రత్యేకమైన సూక్ష్మ అణువులను చొప్పించి మసక కాంతి వచ్చేలా ఒక టెక్నాలజీని రూపొందించారు. ఇళ్లలో తక్కువ తీవ్రత ఉండే కాంతి ప్రకాశించేలా, మొక్కలు స్వీయశక్తితో కాంతినిచ్చేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. విద్యుత్తు లేకున్నా డెస్క్ లైట్లా పనిచేసేలా మొక్కలను తయారు చేయాలనుకున్నామని వివరించారు. మొక్క జీవక్రియ శక్తినే వాడుకొని వెలుగును పుట్టించినట్లు వెల్లడించారు. వెలుగునిచ్చే మొక్కల్ని సృష్టించేందుకు మిణుగురు పురుగుల్లో ఉండే ల్యూసిఫెరేస్ ఎంజైమ్‌ను వాడినట్లు పేర్కొన్నారు.













