పాఠశాల 2019-20 తరగతులు ప్రారంభం
అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల 2019-20 సంవత్సరానికిగాను అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్త విద్యాసంవత్సరం తరగతులను కూడా ప్రారంభిం చింది. కొత్తగా చేరిన విద్యార్థులతో, తల్లితండ్రులతో పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, బే ఏరియా పాఠశాల డైరెక్టర్ ప్రసాద్ మంగిన, అకడమిక్ డైరెక్టర్ రమేష్ కొండ.. టీచర్లు శ్రీదేవి పసుపులేటి, పద్మ (ఫ్రీమాంట్), రజిత (డబ్లిన్), శరత్ పోలవరపు (డబ్లిన్), సత్య బుర్ర, శ్రీదేవి ఎర్నేని, కళ్యాణ్ చికోటి (శాన్రామన్) సమావేశమై పాఠశాల బోధన పద్ధతులను వివరించారు. ఈ అకడమిక్ సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, తల్లితండ్రులు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, బే ఏరియాలోనే పాఠశాల పుట్టిందని, పాఠశాల విజయవంతంగా 7వ విద్యాసంవత్సరంలోకి అడుగుపెడుతోందని చెప్పారు. బే ఏరియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగే పాఠశాల అందరికి మార్గదర్శకం గా నిలిచిందని చెప్పారు. ఫ్రీమాంట్, శాన్ రామన్, డబ్లిన్, సన్నీవేల్, శాన్ హోసే, మిల్పిటాస్లలో తరగతులు ప్రారంభం కావటం చాల సంతోషంగా ఉందన్నారు.













