మాపై అధిక పన్నులు వేయండి
కరోనా ప్రభావంతో సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచాన్ని రక్షించేందుకు సంపన్నులపై అధికంగా పన్నులు వేయాలని వివిధ దేశాల ప్రభుత్వాలను సుమారు 80 మంది కోటీశ్వరులు కోరారు. మానవత్వం కోసం కోటీశ్వరులు పేరుతో వీరంతా తమపై వెనువెంటనే తగినంతగా, శాశ్వతంగా అధిక పన్నులు వేయాలంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో బెన్ అండ్ జెర్రీ ఐస్‌క్రీమ్ వ్యవస్థాపకుడు జెర్రీ గ్రీన్‌ఫీల్డ్, హాలీవుడ్ సినిమాల స్క్రీన్ రైటర్ రిచర్డ్ కుర్టీస్, దర్శకుడు అబిజైల్ డిస్నీ, అమెరికా పారిశ్రామికవేత్త సిడ్నీ టోపోల్, న్యూజిలాండ్ రిటైర్ బిజినెస్‌మ్యాన్ స్టీఫెన్ టిండల్ ఉన్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న తరుణంలో దాన్నుండి ప్రజలు కొలుకునేందుకు మాలాంటి కోటీశ్వరులు కీలక పాత్ర పోషించాల్సి ఉంది అని లేఖలో పేర్కొన్నారు.













