బెంగళూరులో ఒరాకిల్ డేటా సెంటర్ ?
అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ భారత్లో డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉంది. క్లౌడ్ సర్వీసులను డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. వచ్చే 6 నుంచి 9 నెలల కాలంలో ఈ సెంటర్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సెంటర్ బెంగళూరులోనే ఏర్పాటు చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం ఎంత మొత్తం పెట్టుబడి పెట్టేది, ఎంత మందికి ఉపాధి లభించేది మాత్రం తెలియరాలేదు. ఈ సెంటర్ ద్వారా తమ కస్టమర్లకు మరింత మెరుగ్గా సర్వీసులను అందించే అవకాశం ఉంటుందని ఒరాకిల్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ డెవలప్మెంట్) థామస్ కురియన్ చెబుతున్నారు. భారత్లో 40 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టడంతోపాటు బెంగళూరులో విస్తరణ చేపట్టనున్నట్టు గత ఏడాదిలో కంపెనీ ప్రకటించింది.













