ప్రమాదంలో ఆండ్రాయిడ్ ఫోన్లు!
ప్రపంచంలోని మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్లలో వందకోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రమాదంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని వెంటనే అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే ఆ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బై విచ్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. ప్రతీ ఐదు ఆండ్రాయిడ్ ఫోన్లలో రెండు ఫోన్లు గూగుల్ నుంచి సెక్యూరిటీ ఆప్డేట్లను పొందలేకపోతున్నాయని, ఈ ఫోన్లకు గూగుల్ సపోర్ట్ చేయకపోవడమే ఇందుకు కారణమని, ఇలా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల ఫోన్లకు ఆప్డేట్లు రావడం లేదని నిపుణులు తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం కొత్త ఫోన్‌కు మారిపోవడమేనని సూచిస్తున్నారు.













