న్యూజెర్సిలో లక్ష్మణ్ కు ఘన సన్మానం
న్యూజెర్సీ ఎడిసన్‌లోని గోదావరి హోటల్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ వారి ఆధ్వర్యములో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అంతా ఓ కుటుంబంపై ఆధారపడి ఉందని, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోను రెండు కుటుంబాలు తమ ఇష్టమొచ్చినట్లు పాలిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో వారికి ఓటర్లు తగిన బుద్ధి చెపుతారని తెలిపారు. 2019లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం చాలా మంది ఎన్ఆర్ఐలు ఇప్పుడే భారత్ వెళ్లి ప్రచారం ప్రారంభించారని ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ అధ్యక్షులు క్రిష్ణారెడ్డి తెలిపారు.













