విజయవాడ యువకుడికి ఒబామా ఫెలోషిప్
ప్రతిష్ఠాత్మకమైన ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్‌కు విజయవాడకు చెందిన తరుణ్ చెరుకూరి (35) ఎంపికయ్యారు. పౌర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న 10 దేశాల్లోని 20 మంది ఈ ఏడాది ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. వీరిలో తరుణ్ చెరుకూరి ఒకరు. భారతదేశం నుంచి ఒక్క తరుణ్ మాత్రమే ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయనకు ఫెలోషిప్‌ను అందజేయనున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఇండస్ యాక్షన్ పేరిట స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి… ఆర్టీఈ అమలుకు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 90 వేల మంది పేద విద్యార్థులను ఆర్టీఈ పరిధిలో పాఠశాల్లో చేర్పించారు.













