హ్యూస్టన్ లో అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన ఎన్నారైలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా హ్యూస్టన్ లో ఉన్న తెలుగు ఎన్నారైలు సంఘీభావం ప్రకటించి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిని తరలించాలన్న ప్రతిపాదనను వారు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ, రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దని అన్నారు. ఏ రాష్ట్రానికి అయినా ఒకే రాజధాని ఉంటుంది. కాని మన రాష్ట్రానికి మాత్రం 3 రాజధానులు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. రాజధానిని మూడుముక్కలు చేయడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు.













