వాషింగ్టన్ డీసీలో అమరావతికి మద్దతుగా ఎన్నారైల ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, రాజధానిని మూడు చోట్ల ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు ప్రదర్శన నిర్వహించారు. జగన్ ప్రభుత్వం ఏపీలోని మూడు ప్రాంతాల అభివద్ధి పేరిట అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని మానుకోవల్సిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో సతీష్ వేమన, రాంచౌదరి ఉప్పుటూరి, అనిల్, యాష్, లాం కష్ణ, పాలడుగు సాయిసుధ, సూరపనేని సత్య, గుడిసేవ విజయ్ తదితరులతో పాటు పెద్దసంఖ్యలో ప్రవాసులు పాల్గొన్నారు.













