కార్ ర్యాలీ లో తెలంగాణ భవన్ నుండి ప్లీనరీ కి హాజరైన టిఆర్ఎస్ ఎన్నారై నాయకులు
టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆద్వర్యం లో టిఆర్ఎస్ ఎన్నారై నాయకులూ కార్ ర్యాలీలో టిఆర్ఎస్ పార్టీ 17వ ప్లీనరీకి హాజరు అయ్యారు. ఈ ర్యాలీని టపాసులు కాల్చి ప్రారంబించారు. ఈ ర్యాలీ తెలంగాణభవన్ నుండి కొంపల్లి లోని ప్లీనరీ వరకు సాగింది. మహేష్ బిగాల మాట్లాడుతూ ఈ ప్లీనరీ కి 24 దేశాలనుండి 125 మంది హాజరు అయ్యారని తెలిపారు. కెసిఆర్ గారి సూచనా మేరకు ఇప్పటివరకు 25 దేశాలలో ఎన్నారై శాఖలు ప్రారంభించామని ఆదేవిదంగా కెసిఆర్ గారు పెట్టె థర్డ్ ఫ్రంట్ కి కూడా అండగా ఉంటామని అన్నారు. ఎన్నారైలు అందరు నేతన్నకు అండగా ఉంటామని చేనేత వస్త్రాలు ధరించి హాజరు అయ్యారు. ఎన్నారైల సంక్షేమానికి వంద కోట్లను కేటాయించడం సమర్థిస్తూ, కెసిఆర్ రైతు పక్షపాతి అని, థర్డ్ ఫ్రంట్ సమర్థిస్తామని ప్లకార్డుల ప్రదర్శన చేసారు. ఈ ప్లీనరీ కి యుఎస్ఏ నుండి మోహన్, అభిలాష్, అరవింద్, యూకే నుండి అనిల్, అశోక్, నవీన్, యూరోప్ నుండి శ్యామ్ బాబు ఆకుల, ఖతార్ నుండి శ్రీధర్, వై వి శ్రీనివాస్, కృష్ణ, శ్రీధర్, వినయ్, ఫణి, ఆస్ట్రేలియా నుండి నాగేందర్ న్యూజిలాండ్ నుండి విజయ్, కళ్యాణ్, సింగపూర్ నుండి వెంకట్, రజనీకాంత్ పాల్గొన్నారు.













