ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తున్న …. డల్లాస్ ఎన్నారై టిడిపి !!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11 వ తారీఖున జరగనున్న ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు డల్లాస్ లో సమావేశమై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత 5 సంవత్త్సరాలుగా రాష్ట్రములో జరుగుతున్న అభివృద్ధిని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గుర్తించాలని, దక్షిణ భారత దేశములోనే త్వరిత గతిన రెండంకెల అభివృద్ధి చెందుతున్న వైనాన్ని, చంద్రబాబు నాయుడు విశ్రమించకుండా పడుతున్న కష్టాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాల్సిందిగా కోరారు.
వెంకట్ జిల్లెళ్లమూడి మాట్లాడుతూలో, రాష్ట్ర ప్రజలు ఓట్ల ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరాన్ని చెప్పారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకుని, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి గెలిపించి అభివృద్ధిని కొనసాగేట్టు చూడాల్సిందిగా కోరారు. ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం ఈ 5 ఏళ్లలో చెందిన అభివృద్ధిని, సిద్ధ రాఘవరావు చేసిన పనులను వివరించారు.
సాంబ దొడ్డ, తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం అయినా కుడు గూడు, గుడ్డని గుర్తు చేస్తూ, ప్రతి పేదోడికి సొంత ఇల్లు అనేది కల. ఈ ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో దాదాపు 8 లక్షల తెలుగు ప్రజలకు గూడు కల్పించటం, ఇంకో 7 లక్షల ఇల్లు వివిధ స్థాయిలో ఉండటం, తెలుగు దేశం కార్యకర్తగా గర్వించగల పరిణామం గా చెప్పారు. రాష్ట్రములో వివిధ పట్టణాల్లో ప్రారంభించిన అన్న కాంటీన్ల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అని, ఈ కార్యక్రమానికి NRI లు కూడా విరాళాలు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చెయ్యాలి అని కోరుకున్నారు.
జనార్దన్ ఏనిగపాటి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న వైనాన్ని వివరించారు. ముఖ్యంగా పరిశ్రమలను ఒక్క చోటకే పరిమితం చెయ్యకుండా, రాష్ట్రములోని అన్ని జిల్లాలకు విస్తరించటం ఆహ్వానించ దగ్గ పరిణామం. అనంతపూర్, చిత్తూర్, ఉత్తరాంధ్ర, కడప, ప్రకాశం ఇలా అన్ని జిల్లాలకు పరిశ్రమలు విస్తరించటం వల్ల ప్రజలకు చాలా ఉపయోగం అంటూ వివరించారు. నీటిపారుదల విషయములో కూడా ఈ 5 ఏళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని కొనియాడారు. పట్టిసీమ వల్ల సాగులోకి వొచ్చిన కృష్ణ డెల్టా, కడప, అనంతపూర్, చిత్తూర్ జిల్లాలకు నీటిని సరఫరా చెయ్యగలగటం తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పారు.
కిరణ్ తుమ్మల మాట్లాడుతూ, గతంలో రాష్ట్రములో కులాలు, ఫ్యాక్షనిస్టులు గొడవలతో తో వెనకబడిందని , రాజకీయాల కోసం విద్వేషాలు పెంచుతూ ప్రజలను అభివృద్ధికి, అవకాశాలకు దూరం చేసారు అని, తెలుగు దేశం ప్రభుత్వములో కడప లో అది నారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డి, కర్నూల్ లో కోట్ల వర్గము, కేఈ వర్గము, కృష్ణ జిల్లాలోని దేవినేని, వంగవీటి వర్గాలు కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని, ఏప్రిల్ 11 న జరుగు ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారు అని ఆశాభావం వ్యక్త పరిచారు.
బాలాజీ మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యువతకు చేయూత నివ్వటం ప్రస్తావించారు. కాపులకు రిజర్వేషన్స్ కల్పించే ప్రయత్నంతో పాటు, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉన్నత చదువుళ్ళకు సహాయపడటం, వైశ్య, బ్రాహ్మణ కార్పొరేషన్స్ వల్ల పేదలకు ఆర్ధిక సహాయముతో పాటు శిక్షణ లభించటం, రాష్ట్ర అభివృద్ధిలో భాగం చెయ్యటాన్ని కొనియాడారు.
ఈకార్యక్రమం లో ఎన్నారై టిడిపి డల్లాస్, ఎన్టీఆర్ అభిమానులు, ప్రముఖ ఐటి పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.













