చంద్రబాబుకు మద్దతుగా అమెరికాలో ఎన్నారై టీడిపి ప్రచారం
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అమెరికాలోని ఎన్నారై టీడిపి నాయకులు, అభిమానులు కోరుతున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఫేస్బుక్ కార్యాలయం ముందు సమావేశమైన ఎన్నారై టీడిపి అభిమానులు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబును గెలిపించాల్సిన అవసరాన్ని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. నాడు చంద్రబాబు అవలంబించిన దూరదృష్టివల్లనే మాకు అమెరికాలో ఉపాధి లభించిందని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమని వారు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటి, లక్ష్మీపతి, ప్రసాద్ మంగిన, విజయ్ గుమ్మడి, గాంధీ పాపినేని, రాజాకొల్లి, అనిల్, రజనీ కాకర్ల, శివరాం పాల్గొని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. తాము ఇక్కడ నుంచే పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నామని, మరోవైపు ఎపిలో డిజిటల్ వాహనాల ద్వారా చంద్రబాబుకు ఓటు వేయడం ఎంత ముఖ్యమో చెబుతున్నామని కూడా వెంకట్ కోగంటి చెప్పారు.













