వైట్ హౌస్ కు ఉత్తర కొరియా బృందం
ఉత్తర కొరియా ప్రతినిధి బృందం అమెరికాలోని వైట్‌హౌస్‌ను సందర్శించింది. ఉత్తర కొరియా రాయబారి కిమ్ యాంగ్ చోల్ బృందానికి ప్రాతినిథ్యం వహించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రాసిన లేఖను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బృందం అందజేసింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. ఈ లేఖ కోసం వైట్ హౌస్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నది. వైట్‌హౌస్‌లోనికి ఉత్తర కొరియా అధికార బృందం అడుగుపెట్టడం ఇదే ప్రథమం. వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ హోగన్ గిడ్లే మాట్లాడుతూ హోస్టన్ నుంచి విదేశీ విమానం ఒకటి డల్లాస్ మీదుగా ఇక్కడికి చేరుకుందని తెలిపారు. విమానంలో ఉత్తర కొరియా అధికార బృందం ఉందని మాకు తెలుసని వివరించారు. వారు తమ వెంట ఓ ఉత్తరం తీసుకొస్తున్నారని విషయం కూడా ముందే పసిగట్టామని చెప్పారు. ఎంతో మర్వాదపూర్వకంగా ఆ ఉత్తరాన్ని తీసుకోవడం జరిగిందని, న్యూక్లియర్ రహితంగా మార్చడానికి కిమ్ పంపిన ఈ లేఖ ఎంతో ఊతం ఇస్తుందని అన్నారు.













