ఒకే ఒక్క కారణంతోనే మా అమ్మ జడ్జి కాలేకపోయింది
మహిళ అనే ఒక్క కారణంతోనే తన తల్లిని భారత్లో న్యాయమూర్తిగా అనుమతించలేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా శాశ్వత రాయబారి నిక్కీ హేలీ అన్నారు. విదేశీ వ్యవహారాల సమావేశాల్లో మహిళల పాత్రపై నిక్కీ హేలీ మాట్లాడారు. మహిళా న్యాయమూర్తి మా అమ్మే అయి ఉండేది. అయితే మహిళ అన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోజుల్లో తనను ధర్మాసనంలో కూర్చునేందుకు అనుమతించలేదని అన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారాయని, ఇప్పుడు ఎందరో మహిళలు న్యాయవ్యవస్థలో పనిచేస్తున్నారని అన్నారు.







