నైటా ఆధ్వర్యంలో బోనాల జాతర జులై 28న

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో జులై 28వ తేదీన బెల్మంట్ లేక్ స్టేట్ పార్క్, న్యూయార్క్ లో బోనాల జాతరను అబ్బురపరిచే రీతిలో నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యేకంగా అమ్మవారిని పూజించే బోనాలు జాతరను నైటా మొట్టమొదటి సారిగా అమెరికాలో మొదలు పెట్టి గత 3 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా జరుపుతున్నదని చెప్పారు.
ఈ సంవత్సరం కూడా నైటా కార్యవర్గం ఇంకా ఎంతో వైవిద్యంగా బోనాల కార్యక్రమం నిర్వహించడానికి ముందుకొస్తున్నది. ప్రత్యేకమైన బోనంతో న్యూయార్క్ లోని మహిళలు అందరు ముస్తాబై, పిల్లల ఆట పాటలతో కోలాహాహలంగా జరుపుకోడానికి సంసిద్ధమవుతున్నది. ఈ సందర్బంగా బోనాలతోపాటు పలు ఆట పాటలు, పెయింటింగ్, ఐస్ క్రీం, మంచి తెలంగాణ విందు ఏర్పాటు చేయటం జరుగుతుంది.
ఈ బోనాల జాతరకి వందలాదిగా తరలి వచ్చి తెలంగాణ పండుగని దిగ్విజయం చేయవలిసిందిగా న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ప్రసిడెంట్ వాణి సింగిరికొండ, కార్యవర్గం కోరుతున్నది.