అతిబరువుతో బాధపడే వారికి శుభవార్త
అతిబరువుతో బాధపడే వారికి శుభవార్త. పేరుకున్న కొవ్వును వదిలించుకునేందుకు తోడ్పడే కొత్త ఔషధాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆహార నియమాలు పాటించక పోయినా ఇది చక్కటి ఫలితాలను ఇవ్వడం విశేషం. స్థాయిలు పెరిగేకొద్దీ కొవ్వు కణాలు ప్రత్యేక ప్రొటీన్లను విడుదల చేయడం మొదలుపెడతాయి. ఈ ప్రొటీన్లు కొవ్వు కణాల్లోని జీవక్రియా రేటును నెమ్మదింపచేస్తాయి. దీంతో ఊబకాయం, టైప్-2 మధుమేహం, హృద్రోగాలు లాంటి వ్యాధులు చుట్టుముడతాయి. ప్రస్తుతం ఈ కొవ్వు కణాల జీవక్రియా రేటుపై అమెరికాలోని టెక్సాస్ మెడికల్ స్కూల్ నిపుణులు దృష్టిసారించారు. దీన్ని క్రియాశీలం చేసే ఔషధాన్ని వారు అభివృద్ధి చేశారు. ఊబకాయ ఎలుకలకు పది రోజులపాటు దీన్ని అందించారు. దీంతో ప్లాసెబో తీసుకున్న ఎలుకలతో పోలిస్తే వీటి బరువు సగటున ఏడు శాతం వరకూ తగ్గినట్లు వెలుగులోకి వచ్చింది. అరతే కాదు కొవ్వు కణాలూ 30 శాతం వరకూ కరిగినట్లు బయటపడింది.













