టెంపాలో నాట్స్ కాలేజ్ ప్రిపరేషన్ సెమినార్
సెమీనార్ పై విద్యార్ధుల నుంచి చక్కటి స్పందన
అమెరికాలో తెలుగువారికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టెంపా లో విద్యార్ధుల కోసం నాట్స్ కాలేజ్ ప్రిపరేషన్ సెమినార్ నిర్వహించింది. టెంపా బే నాట్స్ ఛాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమీనార్ లో కాలేజ్ చేరబోయే విద్యార్ధులకు ఉపయోగపడే అనేక అంశాలు వివరించడం జరిగింది..అసలు కాలేజ్ లో చేరడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. కాలేజీల్లో ప్రవేశానికి వ్రాయాల్సిన వ్యాసాలు, స్టోరీలైన్స్ ఎలా ఉండాలి. వాటిని అర్థవంతంగా ఉండాలి అనే అంశాలపై ఈ సెమీనార్ లో నిపుణులు వివరించడం జరిగింది. కాలేజీలో ప్రవేశానికి చేయాల్సిన అంశాలు.. చేయకూడని అంశాలపై కూడా విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమైంది. తమకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఈ సెమీనార్ ద్వారా తెలుసుకున్నామని విద్యార్ధులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లల కాలేజీ అడ్మిషన్ల గురించి తమకు కూడా అవగాహన పెరిగిందని విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపారు.













