డిట్రాయిట్ లో విజయవంతంగా నిర్వహించిన ‘ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా సెమినార్’
డిట్రాయిట్ లో నాట్స్ సహకారంతో జి అండ్ సి గ్లోబల్ కన్సార్టియం వారు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా సెమినార్ విజయవంతంగా నిర్వహించారు
సాయంత్రం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులపై ఒక సమావేశం ఉంది. మీరు రావాలి అని ఆహ్వానిస్తే, పాటలు ఆటలు లేకుండా ఉత్సాహమేముంటుంది అయినా మన నాట్స్ వారు ఏర్పాటు చేసారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది అని నమ్మకంతో ప్రేమతొ కాసేపు చూసి వద్దాము అనుకుంటూ వచ్చిన దాదాపు 200 పైగా మిత్రులు శ్రేయోభిలాషులు కార్య్త్రమం చివరిదాకా నిస్సబ్దంగా లీనమైపోయి అలా కూర్చోవడం ఈ కార్యక్రమం ఎంత విజయవంతం అయిందో అనేదానికి నిదర్శనం.
మొదటగా శ్రీమతి సావిత్రి బిక్కిన, శ్రీమతి పద్మ వేములపల్లి గార్లు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాట్స్ నేషనల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ కృష్ణ క్రొత్తపల్లి గారు ముఖ్య అతిథులైన శ్రీ AVR చౌదరి గారిని, చికాగో నుండి వచ్చిన నాట్స్ సంబరాల టీమును పరిచయం చేశారు. తన 9 సంవత్సరాల పయనంలో నాట్స్ సాధించిన విజయాలను, అంధించిన సేవలను సగర్వంగా ఒక AV ద్వారా చూపించగా సభ్యులందరూ హాలు దద్దరిల్లిపోయేలా తమ కరతాళ ధ్వనులతో తమ అభినందనలు తెలిపారు.
పిమ్మట డాక్టర్ ముక్కామల అప్పారావు గారు తాన, నాట్స్ ఆవిర్భావం నాటి సంగతులు చెప్పారు. చికాగో నుండి వచ్చిన సంబరాల టీం తరఫున శ్రీ ప్రవీణ్ మోటూరు, శ్రీ ఫణి రామినేని మాట్లాడుతూ తమ ప్రయత్నాలు, సంబరాల విశేషాలు తెలియజేశారు. అందరినీ పేరుపేరునా సంబరాలకు ఆహ్వానించారు.
శ్రీ చౌదరి గారు తమ ప్రెజంటేషన్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనేక అవకాశాలను గురించి వివరించారు. పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద సోదాహరణంగా వివరణలు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక అవకాశాలను గురించి ఫొటోలతో చూపిస్తూ ఇంతకు ముందు పెట్టుబడులు పెట్టిన వారి లాభాలు ఎలా ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ వివరంగా చూపించారు.
అలానే భారతదేశంలో పెట్టుబడులు పెట్టాక అక్కడినుంచి డబ్బు ఇక్కడకు ఎలా తీసుకు రావచ్చు, పన్నులెలా ఉంటాయి వంటి ముఖ్య విషయాలను గురించి అరటిపండు వలచి పెట్టినంత సులభంగా వివరించారు. ఆయన ప్రసంగం ముగిసేసరికి గంట ఎలా గడిచిందో తెలియలేదు.
ప్రియ రెస్టారెంటు వారందించిన షడ్రసోపేతమయిన విందును ఆస్వాదించారు. శ్రీ చౌదరి గారు ఈ విందు సమయంలో కూడా అందరి దగ్గరకు వెళ్ళి వారి వారి సందేహాలను తీర్చారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేసిన నాట్స్ డిట్రాయిట్ చాప్టర్ ప్రెసిడెంట్ కిషోర్ తమ్మినీడి, గౌతం మార్నేని,శివ అడుసుమిల్లి, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ శ్రీనివాస్ కొడాలి, శ్రీ బిక్కిన సాయి రమేష్, RVP విష్ణు వీరపనేని, నాట్స్ లీడర్స్ శ్రీని కొడాలి, దత్తా సిరిగిరి, శ్రీధర్ అట్లూరి, సుభాష్ రౌతు, వేణు సురపరాజు, ప్రసాద్ గొంది, మోహన్ సూరపనేని మరియు స్థానిక తెలుగు సంస్థల నాయకులు, ప్రతినిధులు, పురప్రముఖులు శ్రీ ప్రతాప్ కోగంటి, శ్రీ వినోద్ కుకునూర్, శ్రీచలపతి కోడూరి, శ్రీ హర్ష అంచె, శ్రీనివాస్ చిత్తలూరి, ప్రసాద్ రావిపాటి తదితరులకు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ సూరపనేని బసవేంద్ర అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు.













