బిడెన్ అభ్యర్థిత్వాన్ని సమర్ధించిన స్పీకర్ పెలోసీ
నవంబర్‌లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి చేరువలో వున్న మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అభ్యర్థిత్వాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ గట్టిగా సమర్థించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభాన్ని సమర్ధవంతంగా అధిగమించే నాయకత్వాన్ని బిడెన్ దేశానికి అందిస్తారని తాను విశ్వసిస్తున్నట్టు ఆమె తెలిపారు. కీలకమైన నేతల మద్దతుతో బిడెన్‌కు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సెనేటర్లు బెర్నీ శాండర్స్, ఎలిజెబెత్ వారెన్ తదితర నేతలు ఇప్పటికే బిడెన్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.













