న్యూజెర్సీలో పోస్టుమార్టం…అంత్యక్రియలకు ఏర్పాట్లు
న్యూజెర్సీలో హత్యకు గురైన నర్రా శశికళ, హనీష్సాయి మృతదేహాలకు మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి ఆమె భర్త హనుమంతరావుకు అప్పగించారు. అక్కడే దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో కడసారి చూపునకు కూడా అవకాశంలేదని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు.







