అమెరికాలో పర్యటనలో ధోనీకి అరుదైన అవకాశం.. ట్రంప్‌తో కలిసి
భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన అవకాశం లభించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గోల్ఫ్ ఆటలో పాలు పంచుకున్నారు. ఇది అనుకోకుండా జరిగింది. ధోనీ తనదైన పొడవాటి జట్టుతో కనిపించగా, డొనాల్డ్ ట్రంప్ తలకు రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుని ఉన్నారు. ఒకరు క్రికెట్ సెలబ్రిటీ అయితే, మరొకరు అమెరికాలో ప్రముఖ రాజకీయ నేత కావడం ఆసక్తికి దారి తీసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎంఎస్ ధోని కోసం గోల్ఫ్ ఆట ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలకు ముందు భారత సంతతి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ట్రంప్ ధోనీతో ఈ పోటీకి తెర తీశారా అన్న సందేహం కొందరికి కలుగుతోంది.













