హెచ్ 1బీ వీసాదారులకు తక్కువ వేతనాలు
అమెరికాలో హెచ్ 1బీ వీసాదారులకు సాధారణ వేతనాలతో పోలిస్తే చెల్లించే వేతనాలు తక్కువేనని ఒక నివేదిక తెలిపింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ లాంటి పెద్ద సంస్థల్లోనూ ఎకనమిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం హెచ్ 1 బీ వీసాదారులు అక్కడి స్థానిక మధ్యస్థ వేతనం కంటే తక్కువ పొందుతున్నారని తేలిపింది. అతి పెద్ద కంపెనీలు సైతం మధ్యస్థ వేతనం కంటే తక్కువ ఉండే లెవల్ 1, లెవల్ 2 వేతనాలనే ఇస్తున్నాయని వెల్లడైంది. కార్మిక శాఖ నిబంధనలు సైతం అనుమతిస్తున్నాయని నివేదిక పేర్కొంది. హెచ్ 1బీ వీసాదారులకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే 30కి పైగా కంపెనీల్లో సగం కంపెనీలు ఉద్యోగులను ఔట్సోర్సింగ్ ద్వారానే నియమించుకుంటున్నాయని తేలింది.













