తానా పోటీలకు హాజరైన మిస్ ఇండియా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభల సందర్భంగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం యాష్బర్న్లో జరిగిన వివిధ రకాల పోటీలకు మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ శ్రీ సైనీ, సినీ తారలు అనిత చౌదరి, అంకిత హాజరయ్యారు. మహాసభల సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలకు సుమారు 2 వేల మంది హాజరయ్యారని తానా ప్రతినిధి బృందం తెలిపింది. బృంద నృత్యం, జంట నృత్యంతో పాటు మిస్టీమ్ తానా, మిస్ తానా, మిసెస్ తానా పేరుతో పోటీల నిర్వహించారు. కమిట్ చైర్ సాయిసుధ, సలహాదారు సత్య సూరపనేని ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. తానా అధ్యక్షుడు సతీశ్ మేమన, వెంకట్రావు మూల్పురి, నరేన్ కొడాలి, జే తాళ్లూరి, రవి పొట్లూరి, రఘు మేక, రవి గౌరినేని తదితరులు పాల్గొన్నారు.













