ఇంగ్లీష్ కే పరిమితం కాదు… తెలుగులోనూ
ఇప్పటి వరకు ఇంగ్లీష్‌కే పరిమితమైన ఇ-మెయిల్ అడ్రస్ ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, సింధీ, బోడో, డోగ్రి, కొంకణి, మైథిలి, మణిపురీ, నేపాలీ భాషల్లోనూ ఇ-మెయిల్ అడ్రస్‌లను అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో యాప్‌లు, ఇతర సర్వీసుల్లోనూ ఈ భాషలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మాతృభాష అవరోధం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా సీవోవో మిథల్ పటేల్ తెలిపారు.













