Youth Chess: న్యూజెర్సీలో ‘మాటా’ ఆధ్వర్యంలో చదరంగం పోటీలు.. ఏప్రిల్ 11న నిర్వహణ
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో అగ్రరాజ్యంలో వరుస కార్యక్రమాలతో తెలుగు కమ్యూనిటీ సందడి మొదలైంది. ఇందులో భాగంగా న్యూజెర్సీలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చదరంగం పోటీలను నిర్వహించడంతో పాటు, జూన్ నెలలో అత్యంత భారీ స్థాయిలో ‘మాటా 2వ మహాసభల’ (MATA 2nd Convention ’26) నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఏప్రిల్ 11న చెస్ టోర్నమెంట్:
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో గల స్వరాజ్ టీవీ కార్యాలయంలో ఏప్రిల్ 11న విద్యార్థుల కోసం అన్‌రేటెడ్ చెస్ పోటీలు జరగనున్నాయి. 1 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఇందులో పాల్గొనవచ్చు. 5-రౌండ్ స్విస్ సిస్టమ్ విధానంలో జరిగే ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారు, జూన్‌లో జరిగే కన్వెన్షన్‌లో ప్రతిష్టాత్మక ట్రోఫీల కోసం పోటీపడే అవకాశాన్ని పొందుతారు.
ఇవి కూడా చదవండి
జూన్ 19-20 తేదీల్లో ‘మాటా’ 2వ మహాసభలు:
ఈ ఏడాది జూన్ 19 , 20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఓక్స్ నగరంలో ఉన్న ‘ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్’ వేదికగా మాటా 2వ మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార , సాహిత్య సెషన్లు ఉండనున్నాయి.
నిర్వాహక బృందం:
ఈ రెండు కార్యక్రమాల విజయవంతం కోసం మాటా కార్యవర్గ సభ్యులు.
ప్రెసిడెంట్: రమణ కె. కిరణ్ దుగ్గిగి
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: ప్రవీణ్ గూడూరు
జనరల్ సెక్రటరీ: విజయ్ భాస్కర్ కలాల్
ట్రెజరర్: శ్రీధర్ గూడాల
నేషనల్ కోఆర్డినేటర్: టోనీ జెన్న
స్పోర్ట్స్ డైరెక్టర్: సురేష్ ఖజానా (646-707-6798)
వీరితో పాటు స్వాతి అట్లూరి, కళ్యాణి బెల్లంకొండ, మహేందర్ నరాల, నాగేష్ చిలకపాటి తదితర కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం www.mata-us.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా హెల్ప్‌లైన్ నంబర్ +1 888-7MATAUS ను సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి








