బఫెట్ ను దాటేసిన జుకర్ బర్గ్
ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఆస్తులు పెరిగాయి. ఇప్పుడు అతను రిచెస్ట్ లిస్టులో మూడవ స్థానంలో నిలిచాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. సంపన్నుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బీజోస్, మెక్రోసాఫ్ట్ వ్వవస్థాపకుడు బిల్ గేట్స్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఫేస్బుక్ షేర్లు 2.4 శాతం పెరగడంతో జుకర్‌బర్గ్ మూడవ స్థానంలో ఉన్న బఫెట్‌ను దాటేశారు. ప్రస్తుతం జుకర్‌బర్గ్ ఆస్తులు 5.61 లక్షల కోట్లు (81.6 బిలియన్ డాలర్లు)గా ఉంటుందని అంచనా వేశారు. టెక్నాలజీ రంగానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సంపన్నుల జాబితాలో తొలి మూడు స్థానాలను ఆక్రమించడం ఇది మొదటిసారి. వారెన్ బఫెట్ కన్నా సుమారు 2565 కోట్ల జుకర్‌బర్గ్ ఎక్కువ సంపాదించినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ప్రపంచ సంపన్నుడిగా కీర్తిగాంచిన బఫెట్ క్రమంగా తన ర్యాంక్‌ను కోల్పోతున్నారు. ఆస్తులను దానం చేయడంలో ఆయన ర్యాంక్ పడిపోతున్నది.













