జర్మనీ లో తెరాస శాఖని ప్రారంభించిన తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
యూరోప్ లో అతి పెద్ద దేశమైన జర్మనీ లో నివసిస్తున్న తెలంగాణవాసులు తెరాస ప్రబుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులయి, ఈ చరిత్రక తరునంలొ బంగారు తెలంగాణా దిశగా సాగుతున్న పయనం లొ తమ వంతు పాత్రని పొషించలని తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలను జర్మనీలోని తెలంగాణవాసులు తమ దేశంలో తెరాస శాఖను ప్రారంభించాలని కోరారు. దీనితో జర్మనీ వెళ్లిన మహేష్ బిగాల వారి కోరిక మేరకు తెరాస జర్మనీ శాఖను వైభవంగా ప్రారంభించి తాత్కాలిక కమిటని ప్రకటించారు.
ఈ సందర్బంగా జర్మనీలో తెలంగాణవాదులకు గులాబీ కండువా కప్పి పార్టీ లోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కొందరు ఆంధ్ర మిత్రులు కూడా పాల్గొని సీఎం కెసిఆర్ గారు తెలుగు బాషా అభివృద్ధికి చేస్తున్న సేవలు చూసి ఎన్నారై తెరాస చేరుతామన్నారు. సభ్యులందరు తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి గురించి, మిషన్ భగీరథ, ఇరవై నాలుగు గంటల కరెంటు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు ఇంకా ఎన్నో విషయాలలో తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో కార్యక్రమాల గురుంచి చర్చించారు.
మహేష్ బిగాల మాట్లాడుతూ జర్మనీ లో తెరాస శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవితగారి సూచనలు మరియు సలహాలు తీసికొని ప్రతి దేశంలో తెరాస శాఖని ప్రారంభిస్తామని, పూర్తి స్థాయి కమిటీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. జర్మనీ తెలంగాణవాసులు సిఎం కె సి ర్ గారి పిలుపు మేరకు తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నం చేయాలని,వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోచించే అవకాశాలు ఉన్నాయ్ అన్నారు.
మునిచ్ మరియు స్టుడ్గట్టు లే కాకుండా మిగతా పెద్ద సిటీలైన ఫ్రాంక్ఫర్ట్ మరియు డస్సెల్డ్రోప్ లకు కూడా శాఖని విస్తరిస్తామని తెలిపారు.ఈ శాఖ ఏర్పాటుకు కృషి చేసిన అనిల్ కూర్మాచలం మరియు శ్యామ్ బాబు ఆకుల కు అభినందనలు తెలిపారు.
జర్మనీ తెరాస తాత్కాలిక కార్యవర్గం: అరవింద్ గుంత, నరేష్ మేసినేని, రాజా రమేష్ చిలకల, రాజేందర్ రెడ్డి మొడుసు, రాజ్ జీవన్గికర్, రమేష్ జిడిగి, వికాస్ రామడుగు, యుగేందర్ చింతనిప్పులా, శివ గోలి, జగదీష్ బొమ్మ, శ్యామసుందర్ అలగందుల.













