కెనడా కాల్గరీ లో లోక శాంతి కొరకు మహా యాగం
కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ ( శ్రీ సాయిబాబా మందిరం) లో శ్రీ మహా విష్ణు సుదర్శన యాగం ఏప్రిల్ 23 నుండి ఏప్రిల్ 26 వరకు లోక కల్యాణార్థం, నిత్య పూజలతో ఘనంగా నిర్వహించడమైనది. ప్రస్తుత కోవిద్-19 వలన చాల మంది భక్తులు ఈ హోమ యాగాన్ని, అభిషేకాలని, హారతులు, నిత్య ప్రవచనాలు లైవ్ నెట్ లో పాల్గొన్నారు. చివరి రోజు శ్రీ మహావిష్ణు, మహా లక్ష్మి కళ్యాణం తో క్రతువు ముగిసింది. శ్రీమతి లలిత , శ్రీ శైలేష్ ఆలయ నిర్మాతలు, వేద పండితుడు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రాజకుమార్ శర్మ గారు ఎంతో మంది వాలంటీర్ల సహకారం తో ఈ యాగ పూజలు వైభవంగా జరిగింది.
ఉదయం నుండి జరిగిన కార్యక్రమములో జ్యోతి ప్రజ్వలన, గురువందనం, చతుర్వేద పారాయణం, ప్రస్తుత కరోనా విముక్తి కొరకు ప్రత్యేకంగా యోగ వసిష్ఠ మంత్రం ఉచ్ఛరణ, యాగం సాంప్రదాయ బద్దంగా జరిగాయి. అందరికి శ్రీ వారి ఆశీస్సులు పరి పూర్ణంగా ఉండాలని వేద ఆశీర్వచనం తో యాగ క్రతువులు ముగిసింది . అతిథులకు మహా నేవేద్యం ఇవ్వడం జరిగింది. సర్వేజనా సుఖినోభవంతు, దైవ స్మరణల తో శ్రీమతి లలిత శైలేష్ దంపతులు గట్టి నమ్మకం తో ఈ సత్కార్యానికి దైవ సంకల్పం తో చాలా వాలంటీర్ల సహాయం తో ముందుకు వచ్చారు. దైవ నమ్మకమే అన్నింటికీ గట్టి పునాది. శ్రీమతి లలిత శైలేష్ దంపతులు మరియు ఎంతో మంది అనఘా, సాయిబాబా భక్తులు ప్రపంచ వ్యాప్తంగా March 24 నుండి విష్ణు సహస్రనామ పారాయణ ఒక కోటి, మూడు లక్షల కు పైగా పఠించారు.
విష్ణు సహస్రనామ పారాయణ తో కనకధారా స్తోత్రం( 7600 పర్యాయములు) ; పురుష సూక్తం ( 2175 పర్యాయములు); సాయి సూక్తం ( 1060 పర్యాయములు) భక్తి పారవశ్యం తో పఠించారు. కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ( శ్రీ సాయి బాబా మందిరం) వారి దైవ కృప తో నిర్విఘ్నం గా ఈ పూజలు, హోమాలు 2016 నుండి నిర్వస్తిస్తున్నారు. శ్రీమతి. లలిత శైలేష్ విజయనగరం జిల్లా లో కిండం అగ్రహారాన్ని దత్తత్త తీసుకొని షిర్డీ సాయిబాబా మరియు శ్రీ లలిత త్రిపుర సుందరి శివకామేశ్వర ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టలు, యజ్ఞ యాగాదులు నిర్వహించారు. ఈ మహత్కార్య ఘన విజయానికి అందరి సహాయానికి పేరు పేరునా కృతజ్ఞతలు ధర్మో రక్షతి రక్షితః ధృడ సంకల్పం తో శ్రీమతి లలిత శైలేష్ ఈ సత్కార్యానికి పూనుకొంటున్నారు. అనఘా దత్త( కాల్గరీ సాయిబాబా మందిరం) 2021 సంవత్సరంలో శ్రీ. మహా గణపతీ, శ్రీ. సుబ్రమణ్య యాగం చెయ్య సంకల్పించారు. ఈ మహత్కార్యాన్ని, మరికొన్ని జయప్రదం గా నిర్వహించాడని కి దాతలు ముందుకు వచ్చి విరాళాలతో సంప్రదించండి. శ్రీమతి లలిత శైలేష్- 001-403-668-0653(canada); email id: Info@anaghadatta.org; website www.anaghadatta.org.













