డొనాల్డ్ ట్రంప్ పై వెల్లువెత్తిన ఆరోపణలు …
రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ ఇచ్చే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ సాయం తీసుకున్నారనీ, బదులుగా ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు విమర్శలొచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బిడెన్‌పైనా, ఆయన కొడుకు హంటర్‌పై ఉన్న అవినీతి ఆరోపణపై దర్యాప్తును వేగవంతం చేయాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడితెచ్చారన్న విమర్శలొచ్చాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడారనీ డెమొక్రటిక్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం తీసుకువచ్చింది.













